తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదు…….

0
5
తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడదు…….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు
  • టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే
  • 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తాం

తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడలేదని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, బాలూ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని, 2023 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.