కుమార్తె జాన్వీ ప్రేమ వ్యవహారంపై స్పందించిన బోనీ కపూర్!

0
1
కుమార్తె జాన్వీ ప్రేమ వ్యవహారంపై స్పందించిన బోనీ కపూర్!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  •  ఇషాన్ తో ప్రేమలో పడ్డట్టు వార్తలు
  • ‘ధడక్’లో కలిసి నటించిన జంట
  • ప్రేమ వార్తలు అవాస్తవమన్న బోనీ

    శ్రీదేవి, బోనీ కపూర్‌ ల పెద్ద కుమార్తె, ‘ధడక్’తో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్‌, ఇటీవలి కాలంలో ఫంక్షన్లు, డిన్నర్ లలో ఇషాన్‌ ఖత్తర్‌ తో కలిసి కనిపిస్తుండగా, వారిద్దరూ ప్రేమలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ‘ధడక్’లో హీరో హీరోయిన్లుగా వీరిద్దరే కలిసి నటించగా, అప్పట్లో ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారిందని వార్తలు వస్తుండటంతో బోనీ కపూర్ స్పందించారు. ఈ వార్తలన్నీ అసత్యమని, కల్పితాలని ఆయన అన్నారు. ఇద్దరూ కలిసి సినిమాలో నటించినందుకు స్నేహితులయ్యారే తప్ప, అంతకు మించి ఇంకేమీ లేదని చెప్పారు. తన కుమార్తెపై తనకు గౌరవం ఉందని అన్నారు. ఇదిలావుండగా, ఇటీవల విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారని, ఇందులోనూ జాన్వీ, ఇషాన్‌ లు కలిసి నటిస్తారని వార్తలు రాగా, వారేమీ తన చిత్రంలో నటించడం లేదని దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ స్పష్టం చేశారు.