మృత్యు వేదికైన బాక్సింగ్ రింగ్…

0
3
మృత్యు వేదికైన బాక్సింగ్ రింగ్…

అమెరికా(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….      

  • గత వారాంతంలో మ్యాచ్…
  • తీవ్రంగా గాయపడిన డష్ డవ్… 
  • చికిత్స పొందుతూ మృతి… 

                                వివరాల్లోకి వెళితే….వరుసగా 13 బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించాడు. 14వ పోటీ మాత్రం అతనికి మృత్యుకుహరమైంది. ప్రత్యర్థి పిడిగుద్దులతో మెదడులో తీవ్ర రక్తస్రావమై, ప్రొఫెషనల్ బాక్సింగ్ లో ఎంతో భవిష్యత్ ఉందని పలువురు భావించిన యువ బాక్సర్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అమెరికాలోని మేరీలాండ్‌, అక్సన్‌ హిల్‌ లో జరిగింది.గత వారాంతంలో రష్యాకు చెందిన మాక్సిమ్‌ డడ్‌ షెవ్‌, ప్యూర్టోరికోకు చెందిన సుబ్రియెల్‌ మటియాస్‌ వరల్డ్ బాక్సింగ్‌ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సూపర్‌ లైట్‌ వెయిట్‌ విభాగంలో బౌట్‌ జరుగగా, మటియాస్‌ వరుసగా విసిరిన పంచ్‌ ల ధాటికి డడ్‌ షెవ్‌, తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రౌండ్ అనంతరం కనీసం డ్రస్సింగ్ రూమ్ కు కూడా నడవలేకపోయిన డడ్ షెవ్ ను, వాషింగ్టన్‌ లోని ఆసుపత్రికి తరలించగా, ఆయన కన్నుమూశాడు.ఈ పోరు 11వ రౌండ్ తరువాత, తన తలను గ్లోవ్స్ చాటున దాచుకుంటూ, తాను ఓడిపోయానన్న సంకేతాలు ఇస్తున్నా, ఆపకుండా సుబ్రియెల్ దాడి చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రష్యా బాక్సింగ్‌ సమాఖ్య ఈ బౌట్‌ పై విచారణ ప్రారంభించింది.