వంకాయ చిప్స్………

0
60
వంకాయ చిప్స్………
కావాల్సినవి:
  • పొడుగు వంకాయలు – మూడు
  • ఉప్పు – తగినంత
  • నూనె – చెంచా
  • మిరియాలపొడి – అరచెంచా
  • ఆరిగానో – చెంచా
తయారీ:
 వంకాయల్ని చక్రాల్లా కోసి కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో వేయలి. తరవాత తీసి తడి తుడిచి మిరియాలపొడీ, ఆరిగానో, నూనె కలిపి 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో అరగంటసేపు బేక్‌ చేసుకుని తీసుకోవాలి. లేదంటే వంకాయ ముక్కల్ని ముందు వేయించుకుని ఆ తరవాత ఉప్పూ, మిరియాలపొడీ, ఆరిగానో చల్లుకోవాలి. ఇలా చేసుకున్న చిప్స్‌ సాస్‌తో బాగుంటాయి.