చీపురు ట్వీట్.. లెంపలేసుకునే వరకూ వెళ్లిందిగా

0
2
చీపురు ట్వీట్.. లెంపలేసుకునే వరకూ వెళ్లిందిగా

 (టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….

  • హేమమాలిన వ్యవహారంపై జరిగిన ట్రోలింగ్ … 
  • ధర్మేంద్ర పాజిటివ్ ధోరణిలో చేసిన ట్వీట్… 

                               వివరాల్లోకి వెళితే……ఇటీవల పార్లమెంటు ఆవరణలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని.. చేత చీపురు పట్టుకొని శుభ్రం చేసే ప్రోగ్రాంను చేపట్టిన సీనియర్ సినీ నటి కమ్ ఎంపీ హేమమాలిన వ్యవహారంపై జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. అమ్మగారు చేసిన పనికి మురిసిపోయిన ఆమె భర్త.. అలనాటి స్టార్ హీరో ధర్మేంద్ర ముచ్చట పడి ఒక ట్వీట్ చేశారు.రీల్ లో తప్పించి రియల్ గా చీపురు పుట్టుకొని (ఆయన ఉద్దేశం ఇంట్లో చీపురు పట్టుకోని అని. ఆ మాటకు వస్తే అంత పెద్ద నటి హేమమాలిని ఇంట్లో భారీగా ఉండే పనోళ్ల పరివారం నేపథ్యంలో మన మాదిరి చీపురు పట్టుకొని ఊడ్చాల్సిన అవసరం ఉండదు) ఉడవటం తాను ఇప్పుడే చూస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. ప్రజాసేవ కోసం.. ఒక మంచి కార్యక్రమం కోసం తన భార్య చేస్తున్న కష్టాన్ని ధర్మేంద్ర  పాజిటివ్ ధోరణిలో చేసిన ట్వీట్.. నెటిజన్లకు మరోలా అర్థమైంది. అంతే.. చలువద్దాలు పెట్టుకొని చీపురు పట్టి ఊడ్చిన హేమను.. ఆమె కష్టాన్ని కీర్తించిన ఆమె భర్త ధర్మేంద్రను ఓ రేంజ్లో నెగిటివ్ కామెంట్లు పెట్టారు. దీంతో.. ధర్మేంద్ర తాజాగా మరో ట్వీటారు. చీపురు గురించి తాను ఒక అర్థంలో మాట్లాడితే.. జనానికి వేరే ఏదో అర్థమైందని.. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు. నన్ను క్షమించు దేవుడా.. లెంపలేసుకుంటున్నా అంటూ ఆవేదనతో ట్వీట్ చేశారు. చూస్తుంటే.. చీపురు ట్వీట్ ధర్మేంద్ర ఇంట్లో ఓ రేంజ్లో రచ్చ జరిగినట్లు అనిపించట్లేదు?