చైనాలో ‘జెర్సీ’ రిలీజ్ ప్లాన్స్ …..

0
7
చైనాలో ‘జెర్సీ’ రిలీజ్ ప్లాన్స్ …..

హైదరాబాద్  న్యూస్‌టుడే:    నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత .. నిర్మాత వంశీ మాట్లాడుతూ .. జెర్సీ చిత్రాన్ని క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించాం. యూనివర్శల్ కాన్సెప్టు ఉన్న చిత్రమిది. ప్రస్తుతానికి తెలుగు రిలీజ్ పైనే  దృష్టి సారించామని తెలిపారు. ఏప్రిల్ 19న ఈ సినిమా వస్తుందా.. రాదా? అంటూ సందిగ్ధతలు వ్యక్తమవుతున్నాయి. అయితే చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తామని నిర్మాత వంశీ తెలిపారు. చైనాలో ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు? అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఒకవేళ రిలీజ్ చేస్తే భారీగానే రిలీజ్ చేసే వీలుందని తెలుస్తోంది. అయితే చైనాకు కనెక్టివిటీ పాయింట్ ఏంటి?  క్రికెట్ అక్కడ ఆడరు కదా? అని సందేహం వ్యక్తం చేస్తే ఎమోషన్ కనెక్టయితే చాలు అంటూ సమాధానం ఇచ్చారు.                           

                                                                                                                     డెస్క్:లక్ష్మీ