క్యారెట్‌-సేమ్యా బొబ్బట్లు………

0
5
క్యారెట్‌-సేమ్యా బొబ్బట్లు………

కావలసినవి: 

 • క్యారెట్‌ తురుము: 2 కప్పులు
 • సేమ్యా: అరకప్పు
 • ఎండుకొబ్బరి తురుము: పావుకప్పు
 • జీడిపప్పుపొడి: పావుకప్పు
 • బెల్లం తురుము: 4 టేబుల్‌స్పూన్లు
 • పంచదార: 4 టేబుల్‌స్పూన్లు
 • మైదా: 4 కప్పులు
 • పాలు: కప్పు
 • నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు

  తయారుచేసే విధానం: 
  * ముందుగా మైదాలో తగినన్ని నీళ్లు పోసి కాస్త నెయ్యి వేసి పూరీ పిండిలా కలపాలి. సేమ్యాను పొడిపొడిలాడేలా ఉడికించాలి. 
  * ప్రెషర్‌పాన్‌లో టేబుల్‌స్పూను నెయ్యి వేసి క్యారెట్‌ తురుము వేగనివ్వాలి. తరవాత పాలు పోసి ఉడికించాలి. ఇప్పుడు పంచదార, బెల్లం తురుము వేసి కరిగేవరకూ ఉడికించాలి. చివరగా ఎండుకొబ్బరి తురుము, జీడిపప్పుపొడి వేసి కలపాలి. ఉడికించిన సేమ్యాను కూడా వేసి కలిపి చిన్న ఉండల్లా చేసుకోవాలి. 
  * మైదాపిండిని పూరీలా చేసి దాని మధ్యలో క్యారెట్‌-సేమ్యా మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేసి చేత్తోనే బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. ఇలాగే అన్నీ చేసి పెనంమీద నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చితీయాలి.