సౌత్ఆఫ్రికా శాఖ ఆధ్వర్యంలో వేడుకలు….

0
6
సౌత్ఆఫ్రికా శాఖ ఆధ్వర్యంలో వేడుకలు….
హైదరాబాద్‌ న్యూస్‌టుడే:
  • దక్షిణాఫ్రికాలో కవిత జన్మదిన వేడుకలు.
  • దీనిని పురస్కరించుకుని అవయవ దాన కార్యక్రమం చేపట్టారు.
నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదినం సందర్భంగా దక్షిణాఫ్రికాలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను టిఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ సౌత్ఆఫ్రికా  శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిని పురస్కరించుకుని అవయవ దాన కార్యక్రమం చేపట్టారు. అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించారు సభ్యులు. టిఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలోని సభ్యులందరూ అవయవ దానం చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
                                                                                                                      డెస్క్:కీర్తి