చంద్రబాబుకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి……ఉండవల్లి

0
1
చంద్రబాబుకు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి……ఉండవల్లి

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • నాకు ఎవరిపైనా వ్యక్తిగత వైరం లేదు
  • పవన్ తో నాకున్న సంబంధం వేరు
  • జగన్ నాతో ఎప్పుడూ గౌరవంగానే ఉన్నారు

                                వివరాల్లోకివెళితే…తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును తాను కలిసేంతర వరకు తామిద్దరం ప్రత్యర్థులమేనని… ఆయనను కలిసిన తర్వాత తనకు ఇవాళ ఆయనపై ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని చెప్పారు. చంద్రబాబుతో తాను గడిపిన గంట వ్యవధిలో ఎన్నో గ్రహించానని… ఆయనలో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయని అన్నారు. పవన్ కల్యాణ్ తో తనకున్న సంబంధం వేరని… ముఖ్యమంత్రి జగన్ తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడని చెప్పారు. జగన్ తో తనకు ఎక్కువ చనువు లేకపోయినా… ఆయన తనతో ఎప్పుడూ గౌరవంగానే ఉంటారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా జగన్ తనతో మంచిగానే ఉన్నారని చెప్పారు.