చంద్రబాబు నాయుడు గారూ బెదిరించకండి…..

0
3
చంద్రబాబు నాయుడు గారూ బెదిరించకండి…..

ఆంధ్రప్రదేశ్:(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు… 

  • ఎవరు ఎక్కడ కూర్చోవాలన్న విషయమై వాగ్వాదం
  • మీరు చెప్పినట్టు సభ నిర్వహించబోనన్న తమ్మినేని
  • ఎవరి సీట్లు వారివేనన్న బుగ్గన

                               వివరాల్లోకి వెళితే…అసెంబ్లీలో సభ్యులు ఎవరు ఎక్కడ కూర్చోవాలన్న విషయమై, తమకే అధికారం ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై గందరగోళం నెలకొనగా, స్పీకర్ తమ్మినేని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “చంద్రబాబునాయుడు గారూ… మీరు చెప్పినట్టుగా హౌస్ రన్ చేయాల్నా?. బెదిరించవద్దు. చంద్రబాబునాయుడుగారూ బెదిరించకండి. డోంట్ డిక్టేటింగ్ చైర్. బెదిరించొద్దు. మీరు ఫోర్స్ చేయకండి. డోంట్ ఓన్డ్ ది పోడియం… నో… మీరు బెదిరించకండి. నో… ప్లీజ్” అంటూ సభను ఆర్డర్ లో పెట్టేందుకు ప్రయత్నించారు. అంతకుముందు గోరంట్ల బుచ్చయ్యచౌదరి వచ్చి చంద్రబాబు పక్కన కూర్చోవడం, అక్కడే లేచి నిలబడి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైంది. ఆ సీటు టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడికి కేటాయించిన నేపథ్యంలో గోరంట్లను తన స్థానంలోకి వెళ్లాలని సూచించడంతో వాదోపవాదాలు పెరిగాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరికి ఏ స్థానం కేటాయించాలో, అది స్పీకర్ నిర్ణయమని, దానిలో మార్పులు ఉండవని అన్నారు.