చంద్రబాబు పై పరువునష్టం దావా వేయనున్న సిఎస్….

0
7
చంద్రబాబు పై పరువునష్టం దావా వేయనున్న సిఎస్….
న్యూస్‌టుడే:
*తనను సహనిందితుడిగా పేర్కొనడంపై ఆయన తీవ్ర ఆగ్రహం…
ఆంధ్రప్రదేశ్ సీ ఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు పై పరువునష్టం దావా వేయాలని యోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కేసులో ఏపీ సీఎం చంద్రబాబు తనను సహనిందితుడిగా పేర్కొనడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సన్నిహితుల ద్వారా సమాచారం. తనపై మరింత దుష్ప్రచారం చేసి యత్నాలను అడ్డుకోవడానికి చంద్రబాబుపై పరువునష్టం దావా వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఆయనకు ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు సూచించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికి మాజీ ఐఏఎస్ అధికారులు చంద్రబాబు తీరును నిరసిస్తున్న సంగతి తెలిసిందే.
                                                                                                             డెస్క్:దుర్గ