ఆమెరికా రోడ్లపై… ‘మేడమ్ లేనప్పుడే ఏదైనా…’ అంటే ‘వద్దురా’ అన్న చంద్రబాబు వీడియో!

0
1
ఆమెరికా రోడ్లపై… ‘మేడమ్ లేనప్పుడే ఏదైనా…’ అంటే ‘వద్దురా’ అన్న చంద్రబాబు వీడియో!

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…..

  • ప్రస్తుతం అమెరికా పర్యటనలో చంద్రబాబు
  • వీధుల్లో చక్కర్లు కొడుతూ చిరుతిళ్లు
  • నేతలతో ఆసక్తికర సంభాషణ

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ఓ సామాన్యుడిలా వీధుల్లో సంచరించాడు. వీధుల్లో నడుస్తూ, అక్కడి అంగళ్లలోని చిరుతిళ్లు కొనుక్కుని తిన్నారు. అదే సమయంలో ఆయన వెంట నడుస్తున్న ఓ పార్టీ నేత, “సార్, ఐస్ క్రీమ్ తింటారా?” అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్పారో వినపడలేదుగానీ, “మేడమ్ లేనప్పుడే మనం ఏదైనా తింటే…” అని అనడం వినిపించింది. దీనికి చంద్రబాబు “వద్దురా…” అని సమాధానం ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.