ప్రభుత్వ పాఠశాల లో తనిఖి….

0
3
ప్రభుత్వ పాఠశాల లో తనిఖి….

 న్యూస్ టుడే నల్లగొండ : పట్టణం లోని బోయగూడ లో వున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశా జిలనుల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల లో ఎంత మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు,ఉపాధ్యాయులు ఎంత మంది హజరు అయ్యారు ఉపాధ్యాయులను అడిగారు.8 మంది ఉపాధ్యాయులకు అందరూ హజరయ్యారని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.హజరు రిజిస్టర్ పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి పరిశీలించారు.5 వ తరగతిలో లైట్ పని చేయక పోవడం తో చీకటి గా వుండడం గమనించిన కలెక్టర్ ప్రదానోపాధ్యాయున్నిమందలించారు. ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు ప్రాధాన్యత నిస్తూ అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చీకటి లో చదువుకోవడం వల్ల కంటి చూపు పై ప్రభావం పడుతుందని అన్నారు. వెంటనే వెలుతురు వుండేలా లైట్స్ ఏర్పాటు చేయాలని హెచ్.ఎం.ను ఆదేశించారు. అనంతరం 6,7 తరగతి గదులు సందర్శించారు. ఆరవ, ఏడవ తరగతిలో లైట్ వేయకుండా విద్యార్థులకు బోధించడం గమనించి వెలుతురు వుండేలా విద్యుత్ బల్బ్ లు ఏర్పాటు చేసి బోధించాలని అన్నారు. క్యారమ్ బోర్డ్ సామగ్రి తరగతి గదిలో వుండటం చూసి విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు నిర్వహించాలని అన్నారు.ఎం.ఈ.ఓ ను పర్యవేక్షించాలని ,టీచర్లు విధులకు గైర్హాజర్ అయితే చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఆకస్మికంగా సందర్శిస్తానని తెలిపారు. కలెక్టర్ వెంట ఎం.ఈ.ఓ నర్సింహ వున్నారు.

                                                                                        డెస్క్: రాఘవ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here