చెన్నై మెరుపు విజయం…

0
3
చెన్నై మెరుపు విజయం…

రాజస్థాన్‌తో చెన్నై లక్ష్యం 152 పరుగులు.. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది..  సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది… అభిమానుల్లో ఆశల్లేవ్‌.. కానీ కెప్టెన్‌ ధోని (58;  43 బంతుల్లో 2×4, 3×6), రాయుడు (57; 47 బంతుల్లో 2×4, 3×6) మెరుపులతో ఆ జట్టు  విజయానికి దగ్గరగా వచ్చింది.ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి రాగా.. ధోని ఔట్‌ కావడంతో మళ్లీ ఉత్కంఠ.. రాజస్థాన్‌లో గెలుపు కళ… అయితే అదృష్టం మాత్రం చెన్నై వైపే ఉంది. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా.. స్టోక్స్‌ వైడ్‌ వేశాడు. అదనంగా వచ్చిన బంతిని శాంట్నర్‌ సిక్స్‌ కొట్టేసి చెన్నైకి సంచలన విజయం అందించాడు. దీంతో సూపర్‌కింగ్స్‌ విజయాల హ్యాట్రిక్‌ కొట్టింది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనికి ఇది వందో విజయం కావడం విశేషం.