చికెన్ హలీం….

0
8
చికెన్ హలీం….
 తయారీకి కావల్సినవి:
 • చికెన్ : అర కేజీ,
 • గోధుమరవ్వ : 250 గ్రా.,
 • నెయ్యి : 100 గ్రా.
 • బ్రౌన్ ఆనియన్ : 50 గ్రా.,
 • పచ్చిమిర్చి : 6,
 • మిరియాలు : 10 గ్రా.,
 • కరివేపాకు : 2 రెమ్మలు,
 • షాజీరా : 10 గ్రా.,
 • దాల్చినచెక్క : 10 గ్రా.,
 • బిర్యానీ ఆకు : 4,
 • నిమ్మకాయ : 1,
 • జీడిపప్పు : 50 గ్రా.,
 • కారం : నాలుగు టీస్పూన్స్,
 • ఇలాయిచీ పొడి : అర టీస్పూన్,
 • పసుపు : పావు టీస్పూన్,
 • పుదీనా : ఒక కట్ట,
 • కొత్తిమీర : ఒక కట్ట,
 • ఉప్పు : తగినంత
  తయారీ విధానం:
చికెన్‌ని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి ఉంచాలి. రవ్వలో నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి దోరగా వేయించాలి. దీంట్లో చికెన్ ముక్కలు వేసి కలుపాలి. కాసేపటి తర్వాత నానబెట్టిన గోధుమ రవ్వ వేసి జీడిపప్పు, తగినన్ని నీళ్లు పోస్తూ రవ్వ ఉడికే వరకూ బాగా కలుపుతుండాలి.రవ్వ, చికెన్ బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి మరికాసేపు కలుపాలి. బాగా ఉడికిందనుకున్న తర్వాత దించేయాలి. కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. మరొక గిన్నెలో నెయ్యి వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్ వేసి వేగాక రుబ్బిన చికెన్ మిశ్రమాన్ని వేసి మళ్లీ కలుపుతుండాలి. సన్నని మంట మీద కాసేపు ఉంచి నిమ్మరసం, ఇలాయిచీ పొడి వేసి దించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్‌తో అలంకరించి వేడివేడిగా తింటుంటే సూపర్ టేస్ట్ అనకమానరు.
                                                                                                                  డెస్క్:లక్ష్మీ