నువ్వులతో చికెన్ నగ్గెట్స్…

0
12
నువ్వులతో చికెన్ నగ్గెట్స్…
కావలసిన పదార్థాలు:
  • బొన్లెస్ చికెన్ ముక్కలు- నాలుగు,
  • నూనె- మూడు కప్పులు,
  • గుడ్లు-రెండు,
  • ఉప్పు -ఒక టేబుల్ స్పూన్,
  • మైదా- ముప్పావు కప్పు,
  • నువ్వులు- అరకప్పు.
తయారీ విధానం : చికెన్ను ముక్కలగా కోసుకోవాలి. వెడల్పాటి కడాయిలో నూనె వేడి చేయాలి. గుడ్లు, నీళ్లు, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. మరోగిన్నెలో మైదా,నువ్వుల్ని కలుపుకోవాలి. కొసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మొదట గుడ్డు మిశ్రమంలో నుంచి తరువాత మైదా మిశ్రమంలో దొర్లించాలి. ఈ ముక్కల్ని బంగారు రంగు వచ్చే వరకు వేగించి పేపర్ టవల్ పైన వేయాలి. అంతే నగ్గెట్స్ రెడీ. విటీని మీకు నచ్చిన సాస్తో తింటుంటే యమ్మియమ్మిగా ఉంటాయి.
                                                                                                   డెస్క్:వసుధ.