రజనీకాంత్, కమలహాసన్ లకు కీలక సలహా ఇచ్చిన చిరంజీవి!

0
4
రజనీకాంత్, కమలహాసన్ లకు కీలక సలహా ఇచ్చిన చిరంజీవి!

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • రాజకీయాలపై సలహా ఇచ్చిన చిరంజీవి
  • ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ఆధారంగా నడుస్తున్నాయి
  • రాజకీయాల్లోకి వెళ్లి సమయం వృథా చేసుకోవద్దు

                                                   వివరాల్లోకి వెళితే…తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమలహాసన్ లకు మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక సూచన చేశారని ఫిలింనగర్ టాక్. అయితే ఇది సినిమాలకు సంబంధించిన సలహాకాదు. రాజకీయపరమైన సలహా. ప్రస్తుత రాజకీయాలు కులం, ధనం ప్రాతిపదికగా నడుస్తున్నాయని… ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చారట. కమలహాసన్ ఇప్పటికే మక్కల్ నీధి మయ్యమ్ అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ త్వరలోనే తన పార్టీని ప్రకటించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన మిత్రులిద్దరికీ చిరంజీవి ఈ మేరకు సలహా ఇచ్చారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే.