చిరూ ద్విపాత్రాభినయం చేయడం లేదట!

0
4
చిరూ ద్విపాత్రాభినయం చేయడం లేదట!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • అక్టోబర్ 2వ తేదీన ‘సైరా’ విడుదల 
  • తదుపరి సినిమా కొరటాలతో
  • ఒక నాయికగా తెరపైకి కాజల్ పేరు

చిరంజీవి తాజా చిత్రంగా సిద్ధమైన ‘సైరా’ విడుదలకి ముస్తాబవుతోంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. చిరంజీవి తదుపరి సినిమాకి కొరటాల దర్శకత్వం వహించనున్నాడు. సామాజిక సందేశంతో కూడిన వినోదభరితమైన కథను ఆయన సిద్ధం చేసుకున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇక ఇద్దరు నాయికల కోసం వచ్చేవారం ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఒక కథానాయికగా కాజల్ ను తీసుకునే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సంగతి తెలిసిందే.