ఒంగోలు మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై సీఎం జగన్ ఆరా… డెస్క్:దుర్గ

0
3
ఒంగోలు మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై సీఎం జగన్ ఆరా…      డెస్క్:దుర్గ

ఒంగోలు:(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • సీఎంకు వివరాలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ
  • బాధితురాలికి పరిహారం చెల్లించాలంటూ జగన్ ఆదేశం
  • రూ.5 లక్షలు పరిహారంగా ఇస్తామన్న హోంమంత్రి సుచరిత

              వివరాల్లోకి వెళితే….ఇటీవల ఒంగోలులో ఓ మైనర్ బాలికను వంచించి కొందరు దుర్మార్గులు రోజుల తరబడి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు.  ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రికి తెలిపారు. అనంతరం, బాధితురాలికి పరిహారం ఇవ్వాలంటూ సీఎం జగన్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను ఆదేశించారు. మైనర్ బాలికకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామంటూ హోంమంత్రి సుచరిత ఈ సందర్భంగా వెల్లడించారు. కాగా, ఒంగోలు ఘటనలో ప్రధాన నిందితుడు గతంలో జగన్ తో సెల్ఫీలు దిగడం, వైసీపీ కండువాలు మెడలో వేసుకుని ర్యాలీల్లో పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్ సైతం ఇదే అంశంపై అధికార పక్షాన్ని ప్రశ్నించడం తెలిసిందే.