రాజధానిపై బొత్స స్టేట్ మెంట్ ఇచ్చినా సీఎం జగన్ స్పందించలేదు!: ఎంపీ సుజనా చౌదరి

0
3
రాజధానిపై బొత్స స్టేట్ మెంట్ ఇచ్చినా సీఎం జగన్ స్పందించలేదు!: ఎంపీ సుజనా చౌదరి

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ఏపీ గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిసిన బీజేపీ నేతలు
  • రాజధాని పట్ల రైతులు ఆందోళనలో ఉన్నారు
  • సీఎం ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారు

                                        వివరాల్లోకి వెళితే…రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నప్పటికీ సీఎం జగన్ స్పందించడం లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. ఏపీ గవర్నర్ ను రాజ్ భవన్ లో బీజేపీ నేతలు ఈరోజు కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజధాని పట్ల రైతులు ఆందోళనలో ఉన్నారని, సీఎం ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్టు చెప్పారు