ఈసీ కార్యాలయం వద్ద సీఎం ధర్నా…

0
2
ఈసీ కార్యాలయం వద్ద సీఎం ధర్నా…

 ఏపి న్యూస్‌టుడే: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ చంద్రబాబు నిరసనకు తెలుపుతున్నారు. పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు సెక్రటేరియట్‌లోని 5వ బ్లాక్‌ వద్ద ధర్నాకు కూర్చున్నారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు ఎన్నికల అధికారి ద్వివేదీతో సమావేశమయ్యారు. టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులను, పోలీసు ఉన్నతాధికారుల బదిలీల విషయమై చంద్రబాబు ప్రస్తావించారు.