కమెడియన్ హీరోలాగా మాట్లాడడం..ఒక హీరో కమెడియన్ లాగా…..

0
6
కమెడియన్ హీరోలాగా మాట్లాడడం..ఒక హీరో కమెడియన్ లాగా…..

న్యూస్‌టుడే:

పవన్ వ్యాఖ్యలకు అలీ కూడా ఘాటుగానే స్పందించిన విషయం తెలిసిందే. పవన్ ఇప్పటికీ తన గుండెలోనే ఉన్నాడని కానీ తను ఎవరినుంచి సహాయం పొందలేదని.. అల్లా దయవల్ల తన పరిస్థితి బాగుందని.. అసలు దేహి అని అడగాల్సిన పరిస్థితి వస్తే చనిపోతానని అన్నాడు. అసలు పవన్ తనను జనసేనలో చేరమని అడగలేదని అన్నాడు.  అసలు వైసీపీలో చేరకూడదని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.  తన ట్విట్టర్ ఖాతా ద్వారా అలీ వీడియో లింక్  ను షేర్ చేసిన ఆయన ”ఒక కమెడియన్ హీరోలాగా మాట్లాడడం..ఒక హీరో కమెడియన్ లాగా మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.   

                                                                                                                 డెస్క్:లక్ష్మీ