విద్యుత్ కొనుగోళ్లపై కమిటీ….

0
2
విద్యుత్ కొనుగోళ్లపై కమిటీ….

(టిన్యూస్ 10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
 

  • శాసనసభలో పీపీఏలపై చర్చ…  
  • విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై భారీ అవకతవకలు…  
  • ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసిన బాబు…

                                   వివరాల్లోకి వెళితే….. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లపై కమిటీ వేశామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శాసనసభలో పీపీఏలపై చర్చ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ… విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై భారీ అవకతవకలు జరిగాయన్నారు. నిపుణుల కమిటీని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అజేయకల్లం, విద్యుత్ కార్యదర్శిపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నిపుణుల కమిటీ విచారణ కొనసాగుతోందన్నారు.చంద్రబాబు హయాంలో అవసరం లేకున్నా ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ… 5శాతం కొనమంటే 5.59శాతం 2016లో కొనుగోలు చేశారన్నారు. 17-18లో 9శాతం కొనుగోలు చేయమంటే 19శాతం కొనుగోలు చేశారన్నారు. 18-19లో 11 శాతం అంటే 23.4శాతం కొనుగోలు చేశారన్నారు. కొంత మందికి లాభం చేసేందుకే ఇలా కొనుగోలు చేశారన్నారు. థర్మల్ పవర్ తక్కువ రేటుకు అందుబాటులో ఉన్నా విండ్ పవర్ ను కొనుగోలు చేశారన్నారు.