కమ్యూనిస్టు కురువృద్ధుడు గురుదాస్‌ దాస్‌గుప్తా కన్నుమూత

0
1
కమ్యూనిస్టు కురువృద్ధుడు గురుదాస్‌ దాస్‌గుప్తా కన్నుమూత

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • కోల్‌కతాలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన సీపీఐ నేత
  • గత కొన్నిరోజులుగా ఊపితిత్తులు, మూత్రపిండాల వ్యాధులతో సతమతం
  • 25 ఏళ్లపాటు పార్లమెంటేరియన్‌గా సేవలు

                               వివరాల్లోకి వెళితే…రెండుసార్లు లోక్‌సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎంపికై రెండున్నర దశాబ్దాల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా సేవలందించిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సీపీఐ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా (83) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులతో సతమతమవుతున్న గురుదాస్‌ ఈరోజు ఉదయం కోల్‌కతాలోని భవానీపూర్ లో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జయశ్రీ దాస్ గుప్తా, ఓ కుమార్తె ఉన్నారు. గురుదాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో భాగంగా ఉన్న బారిసలా ప్రాంతంలో 1936 నవంబరు 3న జన్మించారు. పోరాట యోధుడిగా, వాక్చాతుర్యం ఉన్న నేతగా పేరున్న గురుదాస్‌ దాస్‌గుప్తా రచయిత కూడా. ‘సెక్యూరిటీస్‌ స్కాండల్‌- ఏ రిపోర్ట్‌ టు ది నేషన్‌’ అన్న పుస్తకాన్ని ఆయన రాశారు. 1985, 1988, 1994 సంవత్సరాల్లో రాజ్యసభకు ఎంపికైన ఆయన 2004లో పంక్‌సురా నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు.