విజయారెడ్డికి పట్టిన గతే నీకు కూడా… పొదిలి తహసీల్దారుకు కానిస్టేబుల్ హెచ్చరిక!

0
0
విజయారెడ్డికి పట్టిన గతే నీకు కూడా… పొదిలి తహసీల్దారుకు కానిస్టేబుల్ హెచ్చరిక!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి
  • ప్రభాకర్ రావుకు హెచ్చరికలు
  • కలెక్టర్, ఎస్పీలకు తహసీల్దారు ఫిర్యాదు

తెలంగాణలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి దారుణ హత్య తరువాత రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు లోనవుతుండగా, వారిని బెదిరించే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలి తహసీల్దార్ ప్రభాకర్ రావుకు కూడా విజయారెడ్డికి పట్టిన గతే పడుతుందని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.హైదరాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కిష్టా రెడ్డి అనే యువకుడు ఈ పోస్టులు పెట్టినట్టు సమాచారం. తన ఫేస్ బుక్ ఖాతాలో తహసీల్దారును బెదిరిస్తూ, పొదిలి మండలం రెవిన్యూ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే విజయారెడ్డికి పట్టిన గతే పడుతుంది అంటూ హెచ్చరించాడు. ఇక ఈ పోస్టులు వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్, ఏస్పీ దృష్టికి తహసీల్దారు తీసుకెళ్లగా, కార్యాలయంలో బందోబస్తును పెంచారు.