జలవిద్యుత్ కేంద్రంలో పగిలిన నీటి పైప్‌లైన్.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు……….

0
5
జలవిద్యుత్ కేంద్రంలో పగిలిన నీటి పైప్‌లైన్.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు……….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • అసోంలోని కోపిలి జలవిద్యుత్ కేంద్రంలో ఘటన
  • నలుగురి గల్లంతు
  • గాలిస్తున్న సహాయక సిబ్బంది

అసోంలోని దిమా హసావో జిల్లాలోని కోపిలి జలవిద్యుత్ కేంద్రంలో పైపులైను పగిలిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. మరికొందరు నీటిలో చిక్కుకుపోయారు. పైపులైను పగలడంతో పెద్ద ఎత్తున నీరు ఎగజిమ్మింది. దీంతో విద్యుత్ కేంద్రంతోపాటు చుట్టుపక్కల పరిసరాలన్నీ నీటిలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించారు. అనంతరం జలాశయంలోని అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. పైపులైను పగిలిన ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.