గజగజలాడిస్తున్న సైక్లోన్ ‘బాంబ్’….

0
2
గజగజలాడిస్తున్న సైక్లోన్ ‘బాంబ్’….
అమెరికా న్యూస్‌టుడే:
  • అమెరికాను వణికిస్తున్న సైక్లోన్ ‘బాంబ్’.
  • ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.
అమెరికాను ‘బాంబ్’ తుఫాను వణికిస్తోంది. ముఖ్యంగా డెన్వర్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కొలరాడో, వోమ్నింగ్, నెబ్రాస్కా, డకోటా రాష్ట్రాల్లోనూ భారీగా మంచు వర్షం పడుతోంది. ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు హెచ్చరించారు. గడచిన 24 గంటల వ్యవధిలో 23 మిల్లీబార్ల ఒత్తిడితో మంచు కురిసిందని డెన్వర్ పోలీస్ విభాగం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. రహదారులపై 110 వరకూ రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
                                                                                                          డెస్క్: సుప్రియ