అంగబలం, అర్థబలం ఉన్న అభ్యర్థుల కోసం దృష్టి సాదించిన డీసీసీలు….

0
10
అంగబలం, అర్థబలం ఉన్న అభ్యర్థుల కోసం దృష్టి సాదించిన  డీసీసీలు….

హైద‌రాబాద్ : లోక్ స‌భ ఎన్నిక‌ల యుద్దం మొద‌లుకాబోతోంది. అన్ని పార్టీలు సైనికుల్లాంటి అభ్య‌ర్థుల వేట‌లో ప‌డ్డాయి. ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బలమైన అభ్యర్థులను బరిలో దింపడం లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే డీసీసీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. సర్వేలకు శ్రీకారం చుట్టింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులకు సమస్య ఉండదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంగబలం, అర్థబలం ఉన్న అభ్యర్థుల కోసం దృష్టి సాదించిన డీసీసీలు ప్రతిపాదించిన పేర్లతో పాటు మరికొందరి పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ పై బలమైన అభ్యర్థిని దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్‌.. మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌తో పాటు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ అభ్యర్థిత్వాలను లోతుగా పరిశీలిస్తోంది.