ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం…..

0
11
Auto Draft
హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‎లో ఢిల్లీ విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు పై ఢిల్లీ క్యాపిటల్స్ 39 పరుగుల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 116 పరుగులకే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‎లో మున్రో 40, శ్రేయస్ 45, పంత్ 23 పరుగులు చేశారు.
అనంతరం లక్ష్యచేధన కోసం బ్యాటింగ్‎కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‎కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు వార్నర్ 51, బెయిర్‌స్టో 41 పరుగులు చేయగా..మిగతా మిడిలార్డర్ ఆటగాళ్లు చేతులేత్తేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 116 పరుగులకే ఆలౌట్ అయింది.
స్కోర్లు: ఢిల్లీ 155/7, హైదరాబాద్ 116 ఆలౌట్