తిరుమలలో భక్తుల సందడి .

0
7
తిరుమలలో భక్తుల సందడి .
తిరుమల:న్యుస్‌టుడే:ముఖ్యాంశాలు….
*సాధారణ సర్వదర్శనానికి 18 గంటల సమయం…
*34,290 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టిటిడి అధికారులు తెలిపారు……
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరగడంతో సందడి నెలకొంది.  శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠంలోని అన్ని క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయాయి. దీంతో వైకుంఠం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని శనివారం 92,840 మంది దర్శించుకున్నారని, 34,290 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టిటిడి అధికారులు తెలిపారు. శనివారం  శ్రీవారి హుండీకి రూ. 2.55 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో అన్ని ఏర్పాట్లు కలిపించినట్టు టిటిడి అధికారులు వెల్లడించారు.                  డెస్క్:దుర్గ