ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్………. డెస్క్:దుర్గ

0
2
ఢిల్లీలో మెట్రో రైల్లో ప్రయాణించిన జగన్……….    డెస్క్:దుర్గ

ఢిల్లీ(tnews10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • అఖిలపక్ష సమావేశానికి హాజరైన జగన్
  • విమానాశ్రయం నుంచి పార్లమెంటు వరకు మెట్రోలో పయనం
  • మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం. 

                  వివరాల్లోకి వెళితే…. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన పార్లమెంటు భవనంలోని లైబ్రరీ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, చట్ట సభలకు   ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం, 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.మరోవైపు ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జగన్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి పార్లమెంటు వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు.