ధోనీ… ఆ ఒక్క పని చెయ్యి, న్యూజిలాండ్ తరఫున ఆడు…

0
5
ధోనీ… ఆ ఒక్క పని చెయ్యి, న్యూజిలాండ్ తరఫున ఆడు…

(టిన్యూస్10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….. 

  • పౌరసత్వం మార్చుకుంటే చాన్స్…
  • జట్టులోకి తీసుకోవాలని సిఫార్సు చేస్తాం…
  • విలియమ్సన్ సరదా వ్యాఖ్యలు…
  • ధోనీపై అభిమానాన్ని చూపుతున్నాడంటున్న ఫ్యాన్స్…

                       వివరాల్లోకి వెళితే…..భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఓ వరల్డ్ క్లాస్ క్రికెటరని, ఆ విషయంలో తనకు ఏ మాత్రం సందేహం లేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ తో మ్యాచ్ గెలిచి, ఫైనల్ చాన్స్ కొట్టేసిన న్యూజిలాండ్ జట్టులో, కావాలంటే ధోనీ ఆడవచ్చని అన్నాడు. అందుకోసం ధోనీ ఓ పని చేయాలని, తన పౌరసత్వాన్ని మార్చుకోవాలని సూచించాడు. ధోనీ పౌరసత్వాన్ని మార్చుకుంటే, వెంటనే జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్ కమిటీకి రికమండ్ చేస్తామని అన్నాడు. ఇప్పటికైతే ధోనీ తమ జట్టులో ఆడే అవకాశాలు లేవని, పౌరసత్వం మార్చుకుంటే చాన్స్ లభిస్తుందని అన్నాడు. కాగా, విలియమ్సన్ ఈ వ్యాఖ్యలను సరదాగా చేసినా, అతనికి ధోనీపై ఉన్న అభిమానాన్ని చాటుతున్నాయని అభిమానులు అంటున్నారు. గతంలో సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.