ధోనీపై ప్రశంసల వర్షం కురిపించిన….సన్నీ…

0
12
ధోనీపై ప్రశంసల వర్షం కురిపించిన….సన్నీ…
బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ టీమిండియా మాజీ కెప్టెన్‌ ధనాధన్‌ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించింది. అతను ఫ్యామిలీ పర్సన్‌ అని, వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి తప్పక సమయం కేటాయిస్తాడని, అతనిలో తనకు నచ్చిన గుణం అదేనని చెప్పుకొచ్చింది. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీలియోన్‌ ‘మీకు ఇష్టమైన క్రికెటర్‌ ఎవరు?’ అంటే ధోనీ పేరు చెప్పి, అతనిని పొగడ్తలతో ముంచేసింది. ధోనీ, అతని కుమార్తె జీవాతో కలిసి దిగిన ఫొటోలు చాలా క్యూట్‌గా ఉంటాయని, అవంటే మరీ ఇష్టమని అంది. ‘తేరా ఇంత్‌జార్’ చిత్రంతో సన్నీలియోన్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు టీవీ షోలు, మూడు సినిమాలున్నాయి. వీటిలో రెండు దక్షిణాది సినిమాలు. హిందీలో నటించబోయే సినిమాకు సన్నీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
                                                                                                                   డెస్క్:జ్యోతి