దాహం తీర్చావయ్య గుండెల్లో నిలిచావయ్య ….

0
7
దాహం తీర్చావయ్య గుండెల్లో నిలిచావయ్య ….
కారంచేడు న్యూస్‌టుడే:
1. టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్
2.నీటి పథకం పనులను సోమవారం రాత్రి ఆయన ప్రారంభం
3  ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి
4.ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ
కారంచేడులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ.3.8 కోట్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. నీటి పథకం పనులను సోమవారం రాత్రి ఆయన ప్రారôభించారు. కట్టమల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తెప్పోత్సవాన్ని తిలకించారు. గ్రామంలోని పొదుపు మహిళలతో సమావేశమయ్యారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.  అనంతరం నీటి పథకం పనులకు శంకుస్థాపన చేశారు.  పంచాయతీ రాజ్‌ మంత్రి నారా లోకేష్‌ సహకరించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సహకార సంఘం అధ్యక్షులు యార్లగడ్డ అక్కయ్యచౌదరి, పార్టీ మండల అధ్యక్షుడు టి.శ్రీహరి, స్థానిక నాయకులు జాగర్లమూడి నాగేశ్వరరావు, బాలిగ శ్రీనివాసరావు, యార్లగడ్డ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
                                                                                                             డెస్క్:కోటి