చట్టాన్నిచేతుల్లోకి తీసుకోవద్దు.

0
9
చట్టాన్నిచేతుల్లోకి తీసుకోవద్దు.

చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:

అల్లరి చేయాలని చూస్తే అరెస్టులు తప్పవు..ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు, వారి అనుచరులు తప్పకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి వ్యవహరించాలి.. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రచారం ఎవరైనా స్వేచ్ఛగా చేసుకోవచ్ఛు. అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు.. ప్రచారాన్ని అడ్డుకున్న సందర్భాల్లో ఆర్వోలకు సమాచారం ఇస్తే.. వారు పోలీసు భద్రత కల్పిస్తారు.. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం.. సంఘటనలు మరింత జటిఫఫలం చేస్తే ఇరు పక్షాలపైనా కఠిన చర్యలు తీసుకుంటాం.. ప్రవర్తన నియమావళి అమలు విషయంలో జిల్లా యంత్రాంగం నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి పీఎస్‌ ప్రద్యుమ్న హెచ్చరించారు. ఇప్పటికే 147 కేసులు నమోదు చేశామని.. పలు అరెస్టులు జరిగాయని.. ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల్లో మూడంచెల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం లోపల వెబ్‌ కెమెరా, బయట వీడియోగ్రఫీ, వీటికి తోడుగా సూక్ష్మపరిశీలకులు ఉంటారని చెప్పారు. అల్లరి పనులు చేసి పోలింగ్‌లో అలజడి సృష్టించి ప్రశాంతతను దెబ్బతీయాలని చేస్తే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. జిల్లా సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని.. ఎక్కడైనా, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పలుచోట్ల ప్రచారాలను అడ్డుకోవడం, వారు తిరగబడటం తదితర సంఘటనలతో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారన్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ప్రచారాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎన్నికల ప్రవర్తన నియమాళికి లోబడి వ్యవహరించాలని సూచించారు.                                          డెస్క్:వసుధ