తిరుపతి లడ్డూ ఎలా తయారుచేస్తారో తెలుసా?

0
2
తిరుపతి లడ్డూ ఎలా తయారుచేస్తారో తెలుసా?

              తిరుమల తిరుపతి అంటే చాలు తెలియన ఆధ్యాత్మిక వాదులు ఉండరు. అందులోనూ శ్రీవేంకటేశ్వరుడి దివ్యదర్శనం తర్వాత స్వామి ప్రసాదం అందరికీ అత్యంత ప్రీతిపాత్రమైనవి. అయితే స్వామి వారికి నివేదించి, భక్తులకు పంచిపెట్టే లడ్డూ చాలా ప్రశస్త్యమైనది. ఇటీవల ఈ లడ్డూకు జీఐ గుర్తింపు సైతం వచ్చింది. ప్రపంచంలోనే పేరుగాంచిన లడ్డూ తిరుపతి లడ్డూ. మరో ప్రసాదం వడ. అయితే వీటిని ఎలా తయారుచేస్తారు.. దానిలో ఏయే పదార్థాలను ఎంత తూకంలో వాడుతారు వంటి విషయాలను తెలుసుకుందాం….

కావలసిన పదార్థాలు: శనగ పిండి – 100 గ్రా.; పంచదార – 200 గ్రా.; జీడి పప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్లు; కిస్‌మిస్ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకులు – 4; మిశ్రీ (పటిక బెల్లం చిప్స్) – 50 గ్రా.; పచ్చ కర్పూరం – 2 బిళ్లలు

                 తయారీ ……. ఒక పాత్రలో సెనగ పిండి వేసి, తగినన్ని నీళ్లు పోసి బూందీ తయారుచేయడానికి అనువుగా ఉండేలా కలపాలి మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి బూందీ చట్రంలో వేసి దూయాలి వేగిన తరవాత ఒక పాత్రలోకి తీసుకోవాలి నేతిలోనే జీడిపప్పులు, కిస్‌మిస్ వేసి బాగా వేయించి తీసి పక్కన ఉంచాలి పాన్‌లో పంచదార, ఒక కప్పు నీళ్లు వేసి కరిగించి, ఉడకగానే ఆ పాకాన్ని బూందీ మీద వేయాలి (తీగ పాకం కూడా రాకూడదు) లోగా ఏలకులు, పచ్చ కర్పూరాన్ని చిన్న రోట్లో వేసి నలపాలి (మొత్తం పొడి కాకుండా చూడాలి). బూందీలో వేసి బాగా కలిపాక, వేయించిన జీడిపప్పులు, కిస్‌మిస్‌లు జత చేసి బాగా కలపాలి లడ్డూలు తయారుచేసి, దేవునికి నైవేద్యం పెట్టాలి లడ్డూ రుచి ఇంచుమించు తిరుపతి లడ్డూ రుచిని పోలి ఉంటుంది.