అఘోరశ్వర దేవాలయ విశేషాలు తెలుసా!!

0
3
అఘోరశ్వర దేవాలయ విశేషాలు తెలుసా!!

అఘోరలు.. వీరికొక ప్రత్యేకత. వీరంటే దేశంలోనే అందరీకి అదొక రకమైన అభిమానం, భయం, గౌరవం, భక్తి. అయితే వారికి ఆరాధ్యదైవం శివుడే. ఆయన్ను అఘోరేశ్వరుడుగా పూజిస్తారు. అఘోరేశ్వరుడి ఆలయాలు అతి అరుదుగా ఉంటాయి. అటువంటి దేవాలయం గురించి తెలుసుకుందాం… మన పక్కనే ఉన్న కర్ణాటకలో ఈ దేవాలయం ఉంది. పూర్వం రాజులు నిర్మించిన ఈ

దేవాలయ విశేషాలు…
కన్నడ భాషలో ఇక్కేరి అంటే రెండు వీధులు అని అర్థం. షిమోగా జిల్లా సాగర అనే పట్టణం వద్ద ఇక్కేరి ఒక చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక చూడాలి. ఇక్కేరి క్రీ.శ.1560 నుండి క్రీ.శ 1640 వరకు కెలాడి పాలకులకు రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతంలో గ్రానైట్‌ చే నిర్మించబడిన అఘోరేశ్వర దేవాలయం ప్రసిద్ధి. ఈ దేవాలయ శిల్ప నైపుణ్యతలో చాళుక్యుల, ద్రవిడుల, హొయసలుల, దక్కన్‌ సుల్తానుల మరియు విజయనగర పాలకుల శిల్ప కళా నైపుణ్యాలు కనపడతాయి.

ముఖద్వారం విశేషం
                  ఈ దేవాలయంలో ద్వారాలకు ప్రత్యేకత ఉంది. భారతదేశంలో దేవాలయాలన్నీనూ తూర్పు దిక్కుకు ముఖ ద్వారం వుండేలా నిర్మిస్తారు. కాని ఈ ఇక్కేరి దేవాలయం మాత్రం ఉత్తరదిక్కు ముఖ ద్వారం వుంటుంది. ఇది పూర్తిగా నాలుగు రకాల శైలితో నిర్మించారు. ద్రవిడ శైలి, హోయసల శైలి, చాళుక్య శైలితో పాటు గుడి పైన వుండే గోడలు ‘ఇస్లామిక్‌” శైలితో వుంటాయి. అదే ఇక్కడి ప్రాముఖ్యత. కెలడీ రాజ్యంలొ బంగారు విరివిగా దొరుకుతుంది. విజయనగర రాజులకు సామంతులుగా కెలడీని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించేవారు. వీరి పాలన దాదాపుగా 250 సంవత్సరాల పైన సాగింది. ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకొన్నాక ఈ అఘోరేశ్వర దేవాలయం నిర్మించారు. దేవాలయ నిర్మాణం పచ్చని ప్రదేశం మధ్యలో కొత్త రకమైన రూపురేఖలతో కనపడుతుంది. దేవాలయం లోపల ఆశ్చర్యం కలిగించే శిల్ప శైలి కనపడుతుంది. ఇస్లామిక్‌ ఆర్కిటెక్చర్‌ అని చెప్పవచ్చును. కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి.