దేశంలోని బ్రాండ్లలో ఏది టాప్ తెలుసా?

0
4
దేశంలోని బ్రాండ్లలో ఏది టాప్ తెలుసా?

(టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు……..
 

  • ఇండిపెండెంట్ స్ట్రాటజీ కన్సల్టెంట్’ విడుదల…
  • బ్రాండ్ విలువలో టాటా గ్రూప్ మొదటి స్థానం…     

                      వివరాల్లోకి వెళితే….. తాజాగా లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండిపెండెంట్ స్ట్రాటజీ కన్సల్టెంట్’ విడుదల చేసిన ‘బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా100’ కంపెనీల బ్రాండ్ విలువల్లో అనిల్ అంబానీ కంపెనీల బ్రాండ్ విలువ 65శాతం తగ్గి 3848 రూపాయలకు పడిపోవడం వ్యాపార వర్గాలకు షాకిచ్చింది. అనిల్ అంబానీ కంపెనీల విలువ దేశంలో 56వ స్థానానికి పడిపోయింది. 2018తో పోలిస్తే 28 ర్యాంకులు పడిపోవడం గమనార్హం.భారత్ లో బ్రాండ్ విలువలో టాటా గ్రూప్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా టాటా గ్రూపు ఈ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దీని తర్వాత స్థానాల్లో ఎల్ ఐసీ- ఇన్ఫోసిస్- ఎస్బీఐ- మహీంద్రా సంస్థలు ఉన్నారు.  ఇక ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో 300 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతో ఈ జాబితాలో 14వ స్థానాన్ని దక్కించుకుంది