ఆ ఒక్కరోజూ తిరుమలకు రావద్దు…

0
6
ఆ ఒక్కరోజూ తిరుమలకు రావద్దు…

తిరుమల:(టిన్యూస్10):న్యూస్‌టుడే: 

  • 16వ తేదీన చంద్ర గ్రహణం
  • రాత్రి ఏడు గంలకు ఆలయం మూసివేయనున్నట్లు ప్రకటన
  • 17వ తేదీ ఉదయం 5 గంటల తర్వాతే మళ్లీ తెరిచేది

                          వివరాల్లోకి వెళితే….తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈనెల 16వ తేదీన తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు. ఆరోజు చంద్రగ్రహణం కావున  స్వామి వారి ఆలయాన్ని రాత్రి ఏడు గంటలకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా భక్తులను ముందురోజు అర్ధరాత్రి తర్వాత నుంచే క్యూలైన్లలోకి అనుమతించరని,  ఈ విషయాన్ని గమనించి భక్తులు కొండపైకి రాకుండా ఉండడమే మంచిదని సూచించారు. పది హేడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారన్నారు. ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అందువల్ల దాదాపు పన్నెండు గంటలపాటు స్వామి వారి దర్శనం ఉండదని తెలిపారు. క్యూ లైన్లలోకి కూడా భక్తులను అనుమతించనందున కొండపైకి వచ్చే వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ కారణంగా ఆ సమయంలో భక్తులు రాకుండా ఉండడమే మంచిదని సూచించారు.