మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగడంతో…

0
9
మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగడంతో…
న్యూఢిల్లీ న్యూస్‌టుడే:
  • ఢిల్లీలోని హర్షవిహార్ ప్రాంతంలోని దీప్ భారతి పబ్లిక్ స్కూలులో విషాదం   జరిగింది.
  • ఓ బాలిక మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగడంతో మరణించింది..
పాఠశాలలో మధ్యహ్న భోజన సమయంలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలిక మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగడంతో మరణించిన ఘటన ఢిల్లీలోని హర్షవిహార్ ప్రాంతంలోని దీప్ భారతి పబ్లిక్ స్కూలులో జరిగింది. తరగతి గదిలో ఇద్దరు బాలికలు కలిసి భోజనం చేస్తుండగా మరో బాలిక తన వాటర్ బాటిలో యాసిడ్ తెచ్చింది.అది తెలియాని సంజన (11) అనే బాలిక మంచినీళ్లు అనుకోని తాగడంతో మరణించింది.సంజన నాలుగో తరగతి విద్యార్ధినితో కలిసి భోజనం చేస్తుండగా దప్పిక వేయడంతో మరో విద్యార్ధిని తన బాటిల్ ఇచ్చి నీరు తాగిన బాలిక అరుపులు,కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయింది.  దీంతో బాలికను గురుతేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు.యాసిడ్ తాగిన సంజన శరీరంలో అంతర్గత గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మరణించింది.
                                                                                                           డెస్క్:కీర్తి