పురుగులమందు తాగిన ఎంపీటీసీ మృతి………

0
4
పురుగులమందు తాగిన ఎంపీటీసీ మృతి………

వనపర్తి జిల్లా:(టిన్యూస్10):న్యూస్‌టుడే

  • వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో ఘటన
  • గుమ్మడం గ్రామం ఎంపీటీసీ రజిత (20) మ‌ృతి
  • రెండు రోజుల క్రితం తల్లితో గొడవపడ్డ రజిత

                 వివరాల్లోకి వెళితే……వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో హృదయవిదారక ఘటన జరిగింది. పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న గుమ్మడం గ్రామం ఎంపీటీసీ రజిత (20) మృతి చెందారు. రజిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం రజిత తన తల్లితో గొడవపడ్డారని, దీంతో, మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగినట్టు చెప్పారు. ఈ విషయం గమనించిన ఆమె కుటుంబసభ్యులు వెంటనే రజితను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రజిత ఈరోజు ఉదయం మృతి చెందారు.