ధావన్ సెంచరీ మిస్ …. అభిమానుల జోక్స్ ……

0
4
ధావన్ సెంచరీ మిస్ …. అభిమానుల జోక్స్ ……
ముఖ్యంశాలు:
* సిక్స్‌తో ధావన్‌ సెంచరీని చేజార్చిన ఇంగ్రామ్..
* తొలి ఓవర్ నుంచి ఢిల్లీ జట్టుని గెలిపించే బాధ్యత తీసుకున్న ధావన్..
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ (97 నాటౌట్: 63 బంతుల్లో 11*4, 2*6)కి తొలి సెంచరీ అవకాశాన్ని చేజార్చిన కొలిన్ ఇంగ్రామ్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు తెగ సెటైర్లు వేస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి ఆఖరి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమవగా.. అప్పటికి శిఖర్ ధావన్ 95 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మరోవైపు రిషబ్ పంత్ ఔటవడంతో అప్పుడే క్రీజులోకి వచ్చిన ఇంగ్రామ్ 3 పరుగులు చేసి నెమ్మదిగా ఆడుతుండటంతో.. ధావన్ సెంచరీ ఖాయమని అంతా అనుకున్నారు.
                                                                                                           డెస్క్: సుప్రియ