చినుకు కురిసే వేళలో……..

0
6
చినుకు కురిసే వేళలో……..

వర్షంలో తడిచిన దుస్తులు మరింత అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కాలంలో బయటకు వెళ్లేటప్పుడు వేసుకోవలసిన దుస్తుల గురించి అయోమయానికి లోనవుతూ ఉంటాం! మీ లాంటి వారి కోసమే ఈ మాన్‌సూన్‌ డ్రెస్సింగ్‌ టిప్స్‌!
సల్వార్లు, పాటియాలా ప్యాంట్లు పొడవుగా ఉంటాయి కాబట్టి వానకు తడిసి, బురద అంటుకొని తొందరగా పాడయ్యే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఈ దుస్తులకు బదులు పొట్టిగా ఉండే సల్వార్లు, లెగ్గింగ్స్‌ ఎంచుకోవడం మేలు!
ఈ కాలంలో పొడవాటి దుపట్టాలను మ్యానేజ్‌ చేయడమూ కష్టమే! కాబట్టి వీటికి బదులు స్కార్ఫ్‌, స్టోల్‌ ఎంచుకోవాలి!
తడిస్తే, రంగులు కారే దుస్తులు వేసుకోవడం మానేసి, లెనిన్‌, సింథటిక్‌ డ్రెస్‌లు వేసుకోవాలి!
జీన్స్‌ వేసుకోవచ్చు! కానీ ఒంటికి అతుక్కుపోయి నడవడానికి ఇబ్బందిగా ఉండేటంత బిగుతైన జీన్స్‌ వేసుకోకూడదు. తడిచినా వేరే దుస్తుల్లోకి తేలికగా మారేటంత అనువుగా ఉండేలా చూసుకోవాలి.
చెప్పులు, లేదా బూట్లు పాదాలకు పట్టేసేలా ఉండాలి. వదులుగా ఉంటే నడిచేటప్పుడు మీ దుస్తుల వెనక బురద ఎగిరిపడడం ఖాయం!