జాతక రీత్యా ఏ దశకు ఏ పూజ చెయ్యాలి అన్నది చాలామందికి కలిగే సందేహం అలాగే తమకు జరిగే దశని బట్టి ఆయా గ్రహాలకు సంబధించిన జపాలు, దానాలు ఆచరించడం కూడా చాలా మంది చేస్తారు. కానీ దీనికన్నాకూడా ఆయా గ్రహాల అధిష్టాన దేవతలను ఆరాధించడం వలన మరింత తొందరగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ కింద తెలిపిన విధంగా ఆయాదేవతల పూజలు చేసుకోవడం శ్రేష్టం. కేతు: వినాయకుడు/హయగ్రీవుడు రవి: విష్ణుమూర్తి/శ్రీకృష్ణుడు చంద్రుడు: లలితాదేవి/ భువనేశ్వరి కుజుడు: సుభ్రమణ్యుడు/ చండీదేవి బుధుడు: వెంకటేశ్వరస్వామి/ వినాయకుడు గురుడు: దక్షిణామూర్తి/ శివుడు శుక్రుడు: లక్ష్మీదేవి/ దక్షాయణి శని: ఆంజనేయుడు / కాలభైరవుడు రాహు: సరస్వతి/ దుర్గాదేవి.
డెస్క్:దుర్గ