ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో..అందుతున్న వైద్యం…… డెస్క్:దుర్గ

0
3
ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో..అందుతున్న వైద్యం……         డెస్క్:దుర్గ

విశాఖ:(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు… 

  • ఇచ్చిన మాట మేరకు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్‌
  • నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
  • పూర్తి స్థాయి వైద్యం అందించాలని ఆదేశం 
     

                      వివరాల్లోకి వెళితే….విశాఖ నగరం జ్ఞానాపురానికి చెందిన నీరజ్‌కుమార్‌ ప్రాణాంతక బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. సాధారణ కుటుంబీకులైన తల్లిదండ్రులు కొడుకు స్థితి చూసి తల్లిడిల్లిపోయారు. ఆసుపత్రికి వెళితే ఏకంగా రూ.25 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో హతాశులయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఈనెల 4వ తేదీన జగన్ విశాఖ శారదా పీఠానికి విచ్చేశారు. ఆయన తిరుగు ప్రయాణంలో విశాఖ విమానాశ్రయం వద్ద మిత్రులంతా ‘సేవ్‌ అవర్‌ ఫ్రెండ్‌‘ అని ఉన్న బ్యానర్లు పట్టుకుని నిల్చున్నారు.
కారులోంచి బ్యానర్‌ చూసిన ముఖ్యమంత్రి కారు దిగి వారితో మాట్లాడారు. విషయం తెలుసుకుని ఓదార్చారు. నీరజ్‌కుమార్‌ వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని అక్కడికక్కడే మాటిచ్చారు. ఈ మాట మేరకు ఇప్పటికే నీరజ్‌ వైద్యం కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు విడుదల చేసింది.