మహారాష్ట్రాలో వరుస భూకంపాలు….

0
3
మహారాష్ట్రాలో వరుస భూకంపాలు….

 ముంబయి: (టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….        

  • 12 నిమిషాల్లో 4 భూకంపాలు…
  •  ఘటనలో ఓ 55ఏళ్ల వ్యక్తి మృతి…  

                             వివరాల్లోకి వెళితే….మహారాష్ట్రాలోని పాల్ఘర్‌ జిల్లాలో నిన్న రాత్రి వరుస భూకంపాలు సంభవించాయి. అర్ధరాత్రి సమయంలో కేవలం 12 నిమిషాల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. తొలుత అర్ధరాత్రి 1.03 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. ఆ తర్వాత 1.15 గంటల వరకు 3.6, 2.9, 2.8 తీవ్రతతో మూడు సార్లు భూమి కంపించింది.కాగా, భూకంప తీవ్రతకు దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ 55ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.