కోడిగుడ్లు పచ్చడి..

0
9
కోడిగుడ్లు పచ్చడి..
కావల్సినవి: 
  • కోడిగుడ్లు – డజను
  • కారం – పావుకేజీ
  • ఉప్పు – 200 గ్రా
  • పసుపు – రెండు చెంచాలు
  • మెంతులు
  • జీలకర్ర – చెంచా చొప్పున
  • ఎండుమిర్చి – ఆరేడు
  • చింతపండు – పావుకేజీ
  • నూనె – పావుకేజీ
  • వెల్లుల్లిరెబ్బలు – కొన్ని.
తయారీ: మెంతుల్ని వేయించి పొడిచేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించి పొట్టుతీసి నూనెలో వేయించి పెట్టుకోవాలి. ఓ పాత్రలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతిపిండి, నూనె తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు వేయించిపెట్టుకున్న కోడిగుడ్లు వేసి మరోసారి కలపాలి. మిగిలిన నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్రతో తాలింపు పెట్టి.. పచ్చడిపై వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లిరెబ్బలు అలంకరిస్తే చాలు.. నిల్వ ఉండే కమ్మని కోడిగుడ్డు పచ్చడి సిద్ధం.
                                                                                                            డెస్క్: లక్ష్మీ