ఎమ్మెల్యేలు ప్రిపేర్ అయి అసెంబ్లీకి రావాలి..

0
8
ఎమ్మెల్యేలు ప్రిపేర్ అయి అసెంబ్లీకి రావాలి..

ఆంధ్రప్రదేశ్:(టిన్యూస్10):న్యూస్‌టుడే 

  • అమరావతిలోని అసెంబ్లీ హాలులో జగన్ ప్రసంగం
  • అసెంబ్లీలో మాట్లాడానుకునే ఎమ్మెల్యేలు పేర్లు ఇవ్వాలని సూచన
  • శిక్షణా తరగతులకు టీడీపీ సభ్యుల డుమ్మా

                          వివరాల్లోకి వెళితే…..ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. సభా సంప్రదాయాలు, నిబంధనలపై పుస్తకాలను ప్రతీ సభ్యుడు క్షుణ్ణంగా చదవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ సూచించారు. అమరావతిలోని అసెంబ్లీ హాలులో జరుగుతున్నభేటీలో జగన్ మాట్లాడుతూ.. ‘సభలో మన సంఖ్య ఎక్కువ కదా. మనం చేయి ఎత్తితే స్పీకర్ గారు అవకాశం ఇస్తారని చాలామంది భావిస్తారు.  ఆ లిస్ట్ ప్రకారమే స్పీకర్ గారు అందరికీ అవకాశం ఇస్తారు. ఆ జాబితాలో మన పేరు లేకుండా మనకు అవకాశం రాకపోవచ్చు. దీనికి మరోలా అనుకోవాల్సిన పనిలేదు’ అని తెలిపారు. మనం ఎంత గొప్ప స్పీకర్ అయినా ప్రిపేర్ అయి రాకుంటే ఫెయిలవుతారు. మనం ప్రిపేర్ కాకుండా అప్పటికప్పుడు మాట్లాడితే ఎదుటివారు లేచి ఓ డాక్యమెంట్ తీసి ఇదిగో చూడు.. తెలియకపోతే తెలుసుకో అని అన్నారనుకోండి.. మనమంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతాం.