ఎంపీ అభ్యర్థిపై కాల్పులు….డెస్క్:దుర్గ

0
5
ఎంపీ అభ్యర్థిపై కాల్పులు….డెస్క్:దుర్గ
న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…. 
  • 18 రౌండ్ల కాల్పులు జరిపి పరారైన దుండగులు…
  • పంకజ్‌ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు…
  • బీపీ వరకూ పడిపోయిందన్న వైద్యులు…
  • ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతోందని వెల్లడి… 
                      వివరాల్లోకి వెళితే….ఇటీవల జరిగిన సార్వత్రిక  ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి సీతమర్రి ఎంపీగా నామినేషన్ వేసి అనంతరం విరమించుకున్న వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బీహార్, సీతమర్రి జిల్లాలోని రాజ్‌పూర్ గ్రామానికి చెందిన పంకజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తిపై శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో 18 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న పంకజ్‌ను గుర్తించిన స్థానికులు హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు 7 గంటల పాటు శ్రమించి పంకజ్ శరీరంలోని బుల్లెట్లను తొలగించారు.