సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతి లభించింది… మెగాస్టార్ చిరంజీవి!

0
5
సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతి లభించింది… మెగాస్టార్ చిరంజీవి!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • నిన్న జగన్ తో చిరంజీవి భేటీ
  • ‘సైరా’ కారణంగానే ప్రమాణ స్వీకారానికి రాలేకపోయా
  • సినీ పరిశ్రమకు జగన్ సహకరిస్తానన్నారు

‘సైరా’ చిత్రం షూటింగ్ లో తాను బిజీగా ఉన్న కారణంగానే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి రాలేకపోయానని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. నిన్న జగన్ తో తన భేటీపై ఆయన మాట్లాడుతూ, జగన్ సీఎం కాగానే, ఆయన్ను కలిసి అభినందించాలని భావించానని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని జగన్ ఆకాంక్షించారని చెప్పారు. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని, పరిశ్రమకు ఏది కావాలన్నా సంకోచించకుండా తనను అడగాలని కూడా జగన్ కోరినట్టు చిరంజీవి తెలిపారు. జగన్ సహాయ గుణాన్ని చూసి తనకు చాలా సంతోషమేసిందని, సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతిని సొంతం చేసుకున్నానని అన్నారు.తాను ‘సైరా’ చిత్రం చూడాలని జగన్ ను ఆహ్వానిద్దామని భావించానని, కానీ ఆయన మాత్రం, సతీ సమేతంగా తన ఇంటికి వచ్చి, మధ్యాహ్నం తన కుటుంబంతో కొంత సమయం గడపాలని కోరారని, ఇది తనకు లభించిన ఓ గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. భారతిలో తాను సోదర ప్రేమను చూశానని అన్నారు. ఇక త్వరలోనే ‘సైరా’ చిత్రాన్ని తిలకిస్తానని జగన్ చెప్పారని చిరంజీవి అన్నారు.